ఆనందయ్య మందు పంపిణీలో ప్రొటోకాల్ పాటించాలి

V6 Velugu Posted on May 31, 2021

  • నిపుణుల కమిటీతో సమీక్ష అనంతరం సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతివ్వడానికి ముందు సీసీఆర్‌ఏఎస్‌ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు, ఇతర అధికారులతో సీఎం చర్చించారు. ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గిందనడానికి ఆధారాలు లేవని వారు చెప్పారు. ఆనందయ్య  పి, ఎల్, ఎఫ్, కె, అనే నాలుగు మందులతో పాటు, కంట్లో డ్రాప్స్‌ వేస్తున్నారు, తమ కమిటీ విచారణ సమయంలో కంట్లో వేసే డ్రాప్స్ ముందుకు వాడిన ముడిపదార్థాలు లేనందున కె అనే మందు తయారీని చూపించలేదన్నారు. పీ, ఎల్, ఎఫ్‌లతో పాటు  కంటిలో ఇచ్చే డ్రాప్స్‌ మాత్రమే చూపించారు.కంటి డ్రాప్స్‌ కు సంబంధించి కొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. ఆనందయ్య వాడే పదార్థాలు హానికరం కావని నివేదికల్లో చెప్పారు.

కంటి డ్రాప్స్‌పై  పూర్తి నిర్ధారణలు రావాల్సి ఉంది.
ఆనందయ్య మందు కోవిడ్‌పై ఎంతవరకూ పనిచేస్తుందని సీసీఆర్‌ఎఎస్‌ ట్రయల్స్‌ చేసింది.
ఆనందయ్య మందువల్ల కోవిడ్‌ తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్దారణలు లేవని నివేదికలు స్పష్టంచేశాయి. 
కాకపోతే మందు తయారీలో వాడే పదార్థాల వల్ల ఎలాంటి హాని లేవని చెప్పాయి.
ఈ మందు వాడడం వల్ల కోవిడ్‌ తగ్గిందని చెప్పడానికి లేదు.
అలాగే ఆయుర్వేదం అని గుర్తించడానికి కూడా వీల్లేదు.

ఆనందయ్య ఆయర్వేదం మందుగా గుర్తించాలని కోరితే, దరఖాస్తు చేస్తే దానిపై చట్ట పరిధిలో పరిశీలనలు చేయాలి.

నివేదికల్లో వివరాలు వెల్లడించాక సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలు: 

కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది.

నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం.
కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి  నిరాకరణ.
ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌.

సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
.
 కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నేపథ్యంతో ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని స్పష్టం చేంది రాష్ట్ర ప్రభుత్వం
. ఇతర డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టప్రకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు , ఆనందయ్యమందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్‌ రోగులు రాకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా సోకిన వారి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందని రాష్ట్ర ప్రభుత్వం సూచన.ఆనందయ్య మందు పంపిణీ సందర్భంలో కచ్చితంగా కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశం.
 

Tagged CM Jagan, , anandayya medicine, krishnapatnam anandayya medicine, anandayya drug details, jagan comments on anandayya medicine, jagan review on anandayya

Latest Videos

Subscribe Now

More News