
- రాష్ర్ట పీఆర్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ బాపురెడ్డి
సదాశివనగర్, వెలుగు : టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ జూకంటి బాపురెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఉత్తునూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు వేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు గాదారి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బసంత్, మండల సహ అధ్యక్షుడు బాల్ కిషన్, హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.