హైదరాబాద్, వెలుగు: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–2లో పృథ్వీరాజ్ యోధాస్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. తొలి సెట్‌లో ఓటమి ఎదురైనా పట్టు వదలకుండా పోరాడి తర్వాతి మూడు సెట్లను సొంతం చేసుకుంది. ఫలితంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్ 6–2తో మైటీ మరాఠాస్‌పై గెలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో సంయమనం పాటిస్తూ తర్వాతి మూడు సెట్లను (76–75, 79–77, 76–74)తో కైవసం చేసుకుంది.
యోధాస్ జట్టులో గాథా ఆనందరావు ఖడకే, ఆండ్రియా బెసెర్రా, మటియాస్ గ్రాండే, అభిషేక్ వర్మ వంటి అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన క్రీడాకారులు బరిలోకి దిగారు. కాంపౌండ్ ఆర్చరీలో ప్రపంచ నంబర్‌వన్ బెసెర్రా, రికర్వ్ విభాగంలో వరల్డ్ మూడో ర్యాంకర్ గ్రాండే పోటీపడ్డారు.
