ఏపీ సీఐడీ చీఫ్ గా ఆంజనేయులు

ఏపీ సీఐడీ చీఫ్ గా  ఆంజనేయులు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీ  చీఫ్ సీనియర్ IAS అధికారి ఆంజనేయులుకు జగన్‌ ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతంసీఐడీ  విభాగ అధిపతి సంజయ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కొన్ని రోజులుగా మెడికల్ లీవ్ లో ఉన్నారు.

దీంతో సంజయ్ స్థానంలో ముందు సీఐడీ ఐజీ అయిన శ్రీకాంత్ ను ఇన్ చార్జ్ గా నియమించింది వైసీపీ ప్రభుత్వం. తాజాగా సీఐడీ విభాగానికి సంబంధించి అన్నిబాధ్యతలను ఆంజనేయులుకు అప్పజెప్పింది.  ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ  (జులై 11) సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరుగనుంది. పలు పరిశ్రమల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. GISలో చేసుకున్న MOUల గ్రౌండింగ్ దిశగా చర్చ జరుగనుంది. SIPBలో తీసుకునే నిర్ణయాలకు రేపటి (జులై 12)  క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.