ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతుల వెల్లువ

 ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతుల వెల్లువ

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో ఉత్తరం వైపు నూతనంగా నిర్మిస్తున్న కంపౌండ్ వాల్​ కు ప్రజల సౌకర్యార్థం వాక్​ వే గేట్స్​ ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్​ కు ప్రజల నుంచి వినతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపౌండ్ వాల్​ నిర్మిస్తున్న స్థలం నుంచి రెగ్యులర్​ గా జర్నలిస్టుకాలనీ, విద్యానగర్​ కాలనీ, హౌజింగ్​ బోర్డు కాలనీ వాసులు బస్టాండ్​ కు వెళ్తారు. కంపౌండ్ వాల్​ పూర్తిగా నిర్మిస్తే బస్టాండ్ కు వచ్చి పోయే స్టూడెంట్స్​కు, ఎంప్లాయిస్​కు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి.

కంపౌండ్ వాల్​కు రెండు చోట్ల వాక్ వే గేట్స్ నిర్మించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంగళవారం జర్నలిస్టుకాలనీ కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్​ రవికుమార్​ ను కలిసి కోరారు. వినతిపత్రాలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వాక్​ వే గేట్స్​ ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులకు వివరిస్తారని డిపో మేనేజర్​ తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జర్నలిస్టుకాలనీ కమిటీ అధ్యక్షుడు రాజేందర్​ గౌడ్, బాస  మోహన్, రాజ్​ కుమార్ ఉన్నారు.