రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి.. 11 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పంజాబ్ లో కన్నుమూత..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి.. 11 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పంజాబ్ లో కన్నుమూత..

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గత 11 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా బుధవారం ఇవాళ అక్టోబర్ 8న కన్నుమూశారు. ఈ ప్రముఖ గాయకుడు సెప్టెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదంలో అతని తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కాగా, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.

భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న రాజ్‌వీర్ జవాండా పంజాబ్‌లోని మొహాలిలో మరణించాడు. సమాచారం ప్రకారం, రాజ్‌వీర్ సిమ్లాకు వెళుతుండగా సోలన్ జిల్లాలోని బడ్డి సమీపంలో తన బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. మొదట అతన్ని సోలన్ జిల్లాలోని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతనికి గుండెపోటు వచ్చిందని చెప్పడంతో వెంటనే మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు.  డాక్టర్లు, న్యూరోసర్జన్లు చికిత్స అందించినప్పటికీ తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలవడంతో గత 11 రోజులుగా వెంటిలేటర్‌పైనే  ఉన్నారు. చివరికి నాడీ వ్యవస్థ పడిపోవడం, మెదడు స్పందన సరిగ్గా లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

రాజ్‌వీర్ పరిస్థితి విషమంగా ఉందనే వార్త తెలియడంతో పంజాబీ వినోద పరిశ్రమ, అభిమానులని  తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దిల్జిత్ దోసాంజ్, నీరు బజ్వా, అమ్మీ విర్క్, గిప్పీ గ్రెవాల్, కన్వర్ గ్రెవాల్ ఇతరులు వంటి ప్రముఖులు అతడి మరణ వార్తపై సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతను కోలుకోవాలని సహాయం చేసేందుకు మ్యూజిక్ పరిశ్రమకు చెందిన అతని స్నేహితులు, ప్రముఖులు ముందుకు వచ్చారని రాజ్‌వీర్ తల్లి  చెప్పింది. 

రాజ్‌వీర్ జవాండా ఎవరు: పంజాబ్‌లో జన్మించిన రాజ్‌వీర్ జవాండా 'తూ దిస్ పైండా', 'ఖుష్ రేహా కర్', 'సర్దారి', 'సర్నేమ్ ', 'అఫ్రీన్', 'ల్యాండ్ లార్డ్;, 'డౌన్ టు ఎర్త్', 'కంగనీ' వంటి పాటలతో పంజాబీ మ్యూజిక్ రంగంలో మంచి గుర్తింపు పొందారు. అతను సుబేదార్ జోగిందర్ సింగ్ (2018), జింద్ జాన్ (2019), మిండో ​​తసీల్దార్ని (2019) వంటి పంజాబీ సినిమాలకి కూడా మ్యూజిక్ అందించాడు.