బ్లాక్‌‌హాక్స్‌‌ శుభారంభం

 బ్లాక్‌‌హాక్స్‌‌ శుభారంభం

హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌‌ను  హైదరాబాద్ బ్లాక్‌‌హాక్స్  గ్రాండ్ విక్టరీతో షురూ చేసింది. గురువారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన సీజన్‌‌ తొలి  మ్యాచ్‌‌లో బ్లాక్‌‌హాక్స్ 3-–0 (15-–12, 18-–16, 18–-16)తేడాతో డిఫెండింగ్ చాంప్‌‌ కాలికట్ హీరోస్‌‌ను చిత్తు చేసింది. 

హైదరాబాద్ కెప్టెన్ పౌలో లమౌనియర్ జట్టును ముందుండి నడిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. బ్లాక్ హాక్స్ సహ యజమాని, హీరో విజయ్ దేవరకొండ మ్యాచ్‌‌కు హాజరరయ్యాడు. ఇక,శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు 3–2తో గోవాను ఓడించింది.