Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అప్డేట్..శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ ఫిక్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అప్డేట్..శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ ఫిక్స్

పవన్‌ కల్యాణ్‌-హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో నేడు (జులై22న) ఉస్తాద్‌ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ రాశీఖన్నా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రాశీఖన్నా ‘శ్లోక’పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్లో వెల్లడించారు. శ్లోక పాత్ర సినిమాలో ఎంతో కీలకం.. తన పాత్రతో సినిమాకు మరింత అందం అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.

అయితే, చాలా రోజులనుంచి ఉస్తాద్లో రాశీఖన్నా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇపుడీ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పవన్ సరసన మరో బ్యూటిఫుల్ నాయిక సెట్ అయిందని ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్లో కీలక తారాగణంపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ఆఫర్తో రాశీ మళ్ళీ తెలుగులో బిజీగా అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

రాశీఖన్నా..‘ఊహలు గుసగుసలాడే’మూవీతో  తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో 'తెలుసు కదా' మూవీలో నటిస్తుంది.