రైల్వే హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు

రైల్వే హాస్పిటల్లో  అధునాతన సౌకర్యాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్‌ లాలాగూడ సెంట్రల్ రైల్వే హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలను రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగదీష్ చంద్ర శనివారం ప్రారంభించారు. 2డీ ఎకో మెషినరీ, ఆక్సిజన్ ప్లాంట్ మ్యానిఫోల్డ్ రూమ్, పునరుద్ధరించిన ఫిజియోథెరపీ సెంటర్, కార్పొరేట్ బిల్లింగ్ సెక్షన్​ను ఆయన ఆవిష్కరించారు. వీటి ద్వారా రైల్వే ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తాయన్నారు.