సముద్రం అల్లకల్లోలం... తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఐఎండీ వార్నింగ్..

సముద్రం అల్లకల్లోలం... తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఐఎండీ వార్నింగ్..

నార్త్‌ ఇండియాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు సౌత్‌ ఇండియాపై విరుచుకుపడుతున్నాయి..తెలుగు రాష్ట్రాల్లో  ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి.. అటు వరంగల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సలహా పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో బుధవారం (జులై 26) సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) వర్షం విడవకుండా కురుస్తూనే ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. మరో మూడు రోజులు  ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో  అతి భారీ వర్షాలు కురుస్తాయని  ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది.

వాతావరణ శాఖ (వార్తరాసే సమయానికి)  ఇచ్చిన అప్‌డేటెడ్‌ ప్రకారం అల్లూరి సీతారామరాజు, తీరప్రాంత పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇదే సమయంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడన వర్షాలు పడతాయని పేర్కొంది.. ఈ సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, అల్లూరి, ఏలూరు, ఎగువ పశ్చిమ గోదావరి జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది వాతావరణశాఖ. దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్రను అనుకుని స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. నెమ్మదిగా కదులుతూ ఇవాళ రోజంతా భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గాలులు తీవ్రంగా వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది వాతావరణశాఖ