Skanda Twitter Review : మాస్ ఆడియన్స్కు కల్ట్ జాతరే

 Skanda Twitter Review  :   మాస్ ఆడియన్స్కు కల్ట్ జాతరే

మాస్ చిత్రాల ద‌ర్శకుడు బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కాంబోలో వచ్చిన ఊరమాస్ మూవీ ‘స్కంద‌’. కెరీర్ లో మొదటిసారి రామ్  నుండి వస్తున్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో స్కంద మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్,ట్రైలర్స్ కూడా అంతకుమించి ఉండటంతో.. ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఇవాళ(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్స్ పడిపోవడంతో.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి స్కంద ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.

స్కంద మూవీ టిపికల్ బోయ‌పాటి శ్రీను మార్క్ సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. నిజానికి ఆయన సినిమాల్లో క‌థ‌కంటే మాస్‌, యాక్షన్ అంశాలు, ఎలివేష‌న్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్కంద విషయంలో కూడా అదే జరిగిందని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. కానీ.. మాస్ అండ్ యాక్షన్ ల‌వ‌ర్స్ కు మాత్రం ఈ సినిమా మంచి ట్రీట్‌లా ఉంటుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రఫ్ అండ్రడ్ లుక్‌లో రామ్ క్యారెక్టర్, డైలాగ్ డెలివ‌రీ చాలా కొత్తగా ఉన్నాయ‌ని, ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకు పెద్ద ప్లస్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే.. కొన్ని చోట్ల వ‌ర్కవుట్ అయ్యిందని చెబుతున్నారు. రొమాంటిక్ సీన్స్‌, పాట‌ల్లో రామ్‌, శ్రీలీల కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయ్యిందని, దాన్ని డైరెక్టర్ స్క్రీన్ పై బాగా ప్రజెంట్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డాన్స్ లో ఈ జంట మాస్ జాతర చేశారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక త‌మ‌న్ బీజీఎమ్ సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టిందని, మెయిన్ గా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే బీజీఎం ఐతే గూస్ బంపై తెప్పించిందని చెప్తున్నారు. ఇక మొత్తంగా చెప్పాలంటే.. స్కంద బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ అని, మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నారు.