
‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా ఆకట్టుకున్న రామ్‌చరణ్, ‘ఆచార్య’లో నక్సలైట్‌గా కనిపించాడు. రాబోయే చిత్రంలో తను ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు, ఏ గెటప్‌లో కనిపిస్తాడు అనే ఆసక్తి ఉండటం కామన్. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అతను ఐఏఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే కొంత క్లారిటీ వచ్చింది. పొలిటీషియన్ గానూ కనిపిస్తాడనే టాక్ ఉంది. అయితే ఇటీవల లీక్ అయిన కొన్ని ఫొటోస్‌లో పంచెకట్టుతో సైకిల్ తొక్కుతూ కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు చరణ్. ఈ గెటప్ ఏ పాత్రకు సంబంధించింది అనే విషయం ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కొత్త నటీనటుల ఎంపిక జరుగు తోందని, ఆసక్తి ఉన్నవాళ్లు సంప్రదించమంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ విషయం టీమ్ వరకూ వెళ్లడంతో నిర్మాత దిల్‌రాజు ఓ నోట్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా అబద్ధమని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నా రు. ప్రస్తుతం ఈ చిత్రం జెట్ స్పీడుతో షూటింగ్ జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్. నవీన్ చంద్ర, అంజలి, జయరామ్, సునీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.