పెళ్లి ఒక జబ్బు దానికి విడాకులే  మందు

V6 Velugu Posted on Oct 02, 2021

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ..పెళ్లి, విడాకులపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు.పెళ్లి ఒక జబ్బు అని.. విడాకులే దానికి మందు అని తెలిపాడు. పెళ్లిని బ్రిటీష్ పాలనతో పోల్చిన వర్మ.. విడాకులను స్వాతంత్ర్యం అని అన్నాడు. హిట్లర్ యుద్ధాన్ని ప్రారంభించడాన్ని పెళ్లి అని భావిస్తే.. గాంధీజీ స్వాతంత్ర్యం సాధించడాన్ని విడాకులు అని చెప్పుకోవచ్చన్నాడు. 

పెళ్లిళ్లు నరకంలో జరుగుతాయని.. విడాకులు స్వర్గంలో జరుగుతాయన్నారు ఆర్జీవీ. అందుకే పెళ్లి కంటే విడాకులు తీసుకున్నప్పుడే ఎక్కువగా వేడుకలు చేసుకోవాలని సూచించారు. సంగీత్ వంటి కార్యక్రమాలు చేసుకోవాల్సింది విడాకులు సమయంలోనే అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

ఆర్జీవీ ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ పాతదే అయినా.. నాగ చైతన్య, సమంత విడిపోతున్న ప్రకటించడంతో ఇవాళ మరోసారి రీ ట్వీట్ చేశాడు.

Tagged marriage, Ram gopal varma, comments, divorce

Latest Videos

Subscribe Now

More News