రామారావు ఆన్ డ్యూటీ.. జులై16న ట్రైలర్

రామారావు ఆన్ డ్యూటీ.. జులై16న ట్రైలర్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శరత్ మండవ డైరక్షన్ లో వస్తోన్న మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌  హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  జులై 29న వరల్డ్ వైడ్ గా ఈ  సినిమా రిలీజ్ కానుంది.  మూవీ ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ ను  జులై16న  రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే మేుకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.  1995లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇందులో రవితేజ తహశీల్దార్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి  ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నారు.  సినిమా పైన భారీ అంచనాలున్నాయి.