జూబ్లీహిల్స్ వెలుగు : ర్యాపిడోలో బంగారు నగలు పంపగా గుర్తించిన డెలివరీ బాయ్ వాటితో సహా మాయమైపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని వివో సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న దత్త ప్రసాద్ నల్లపాటి ఈ నెల నాగోల్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి బంగారు నగలు పంపించేందుకు ర్యాపిడో బుక్ చేశారు. బైక్‌పై వచ్చిన గీడిమెట్ల మురళి ..సెక్యూరిటీ గార్డు వద్ద పార్శిల్ తీసుకున్నాడు.
అందులో రూ.62,383 విలువైన బంగారు మెట్టెలు, రోజ్‌గోల్డ్ పట్టీలున్నాయి. పార్శిల్ తీసుకున్న తర్వాత పెట్రోల్ ఖర్చుల కోసం రూ.100 కావాలని ర్యాపిడో బాయ్ కోరడంతో దత్త ప్రసాద్ ఫోన్‌పే ద్వారా పంపించారు. కొద్దిసేపటి తర్వాత రైడర్ కు ఫోన్ చేయగా, అందుబాటులోకి రాలేదు. నాగోలులో ఉన్న బంధువులను ఆరా తీయగా పార్శిల్ రాలేదని చెప్పారు. ర్యాపిడో బాయ్‌కి ఫోన్ చేయగా నంబర్‌ను బ్లాక్ చేశాడు. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
