సర్కార్ ఆస్పత్రిలో ఎలుకల స్వైర విహారం

సర్కార్ ఆస్పత్రిలో ఎలుకల స్వైర విహారం

కామారెడ్డిలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఐసీయూతో పాటు ట్రామా కేర్ సెంటర్, అత్యవసర మందులు ఉంచే చోట ఎలుకలు తిరుగుతున్నాయి. ఆక్సిజన్ పైపుల మీదుగా గోడల మీద నుంచి తమ బెడ్ల పైకి ఎలుకలు వస్తున్నాయంటున్నారు పేషెంట్లు. 
ఎలుకలు రాకుండా నెట్స్ ఏర్పాటు చేశామని, అవి ఎలా వస్తున్నాయో తెలియదన్నారు వైద్య శాఖ అధికారులు. శానిటేషన్ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఎలుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. 
ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఒక రోగిని ఎలుకలు కొరికిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావం జరిగి కోలుకోలేక ఆ రోగి మృతి చెందిన ఘటనకు బాధ్యుడిగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు సహా ఇద్దరు డాక్టర్లపై సస్పెన్షన్ వేటు వేయడం.. శానిటేషన్ కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకున్న ఘటనలు సంచలనం రేపాయి. ఈ ఘటనల నేపథ్యంలోనైనా కామారెడ్డి ప్రధాన ఆస్పత్రిలో కూడా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి తరహా పరిస్థితే ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. 

 

 

ఇవి కూడా చదవండి

ఈవో వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం

చనిపోయిన కొడుకు విగ్రహానికి ఏటా శ్రీరామ నవమి నాడు కళ్యాణం

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు