ఈవో వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం

ఈవో వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం
  • యాదగిరిగుట్టలో 10వ రోజు జేఏసీ నేతల నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరి గుట్టలో స్థానిక జేఏసీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ 10వ రోజుకు చేరుకున్న సందర్భంగా యాదాద్రి  ఆలయ ఈవో గీత వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు జేఏసీ నేతలు. యాదగిరిగుట్ట కొండపైకి ఆటోల రాకపోకలపై విధించిన ఆంక్షలను తొలగించాలని డిమాండ్  చేశారు. స్థానికులకు ఆంక్షలు లేని దర్శనం కలిగించి కొండపైకి వాహనాలను అనుమతించే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.

వందల కోట్ల రూపాయల ఖర్చుతో నవీకరించిన యాదాద్రి ఆలయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆలయ నవీకరణ పనుల వల్ల దాదాపు ఆరేళ్లుగా యాదాద్రి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. మరోవైపు కరోనా ఆంక్షలతో ఇబ్బందిపడిన స్థానికులు ఆలయం పునః ప్రారంభం కావడంతో మంచిరోజులు వచ్చాయని సంతోషించగా.. కొత్తరకం ఆంక్షలతో ఇబ్బందిపడుతూ నిరసనలకు దిగారు. 

 

 

ఇవి కూడా చదవండి

చనిపోయిన కొడుకు విగ్రహానికి ఏటా శ్రీరామ నవమి నాడు కళ్యాణం

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు

ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు పోలీసు కస్టడీ