చనిపోయిన కొడుకు విగ్రహానికి ఏటా శ్రీరామ నవమి నాడు కళ్యాణం

 చనిపోయిన కొడుకు విగ్రహానికి ఏటా శ్రీరామ నవమి నాడు కళ్యాణం
  • చనిపోయిన కొడుకుకు ఏటా శ్రీరామ నవమి నాడు కళ్యాణం

మహబూబాబాద్: చనిపోయిన బిడ్డ జ్ఙాపకంగా గుడి కట్టి ఏటా శ్రీ రామ నవమి రోజున కళ్యాణం జరిపిస్తున్నారు  తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన భూక్యా లాలు, సుక్కమ్మల కొడుకు రాంకోటీ అదే తండాలోని అమ్మాయిని ప్రేమించాడు.  పెద్దలు ప్రేమను నిరాకరించడంతో 2003 సంవత్సరంలో రాంకోటి ఆత్మహత్య చేసుకున్నాడు.  
రాంకోటి తల్లి సుక్కమ్మ కు ఓ రోజు కలలో వచ్చి ప్రతి శ్రీ రామనవమి రోజు పెళ్లి చేయాలని కోరాడని సుక్కమ్మ తెలిపింది. దీంతో ఇంటి ముందు గుడి కట్టించి గుడిలో రాంకోటితో పాటు.. అమ్మాయి విగ్రహాలని ప్రతిష్టించారు. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శ్రీ రామ నవమి రోజు విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తున్నారు రాంకోటి తల్లిదండ్రులు. 

 

ఇవి కూడా చదవండి

వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు

ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు పోలీసు కస్టడీ

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు