పొంగల్ పోటీ నుంచి రవితేజ ఈగల్ అవుట్.

పొంగల్ పోటీ నుంచి రవితేజ ఈగల్ అవుట్.

రవితేజ ఈగల్‌ మూవీ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో ఉంటుందనుకున్న  ఈ సినిమా అనుహ్యంగా రేసు నుంచి తప్పుకుంది.   సంక్రాంతి సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ గురువారం సమావేశమయ్యాయి.  రెండు రోజుల వ్యవధిలో ఐదు సినిమాలు రిలీజైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా చిత్రాల నిర్మాతలతో చర్చించాయి. 

ఈ క్రమంలో ఈగల్ చిత్ర నిర్మాతలు సినిమాను వాయిదా వేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాను 2023  ఫిబ్రవరి 9న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సంక్రాంతికి జనవరి 12న  మహేశ్‌బాబు గుంటూరు కారం, అదే రోజున తేజ సజ్జ హను-మాన్‌, జనవరి 13న వెంకటేశ్‌ సైంధవ్‌, జనవరి 14న నాగార్జున నా సామిరంగ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.  

ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే..  కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని  టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు.  ఇందులో రవితేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించగా. న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషించాడు.  ముందుగా ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్.