మార్చి 31 వరకు కేవైసీ డెడ్ లైన్

మార్చి 31 వరకు కేవైసీ డెడ్ లైన్

న్యూఢిల్లీ: బ్యాంకుల దగ్గర కేవైసీ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిచ్చింది. కరోనా   పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  ‘కరోనా కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల వలన పీరియాడిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవైసీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నాం’ అని గురువారం పేర్కొంది. కాగా, కేవైసీ పూర్తి చేయని కస్టమర్ల అకౌంట్లపై డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 వరకు ఎటువంటి రిస్ట్రిక్షన్లు ఉండవని ఈ ఏడాది మే 5 న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ సర్క్యూలర్​ విడుదల చేసింది. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా రిస్ట్రిక్షన్లు పెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, మార్చి 31 వరకు కేవైసీ పూర్తి చేయని కస్టమర్ల అకౌంట్లపై  రెగ్యులేటెడ్ సంస్థలు (బ్యాంకులు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు వంటివి) ఎటువంటి రిస్ట్రిక్షన్లు పెట్టకూడదు’ అని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వివరించింది. కాగా, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ లేదా కోర్టు లేదా ఇతర రెగ్యులేటరీ, దర్యాప్తు సంస్థలు కోరితే మాత్రం కస్టమర్ల అకౌంట్లపై  రిస్ట్రిక్షన్లు ఉంటాయి. రెగ్యులేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు తమ కస్టమర్ల కేవైసీని పూర్తి చేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కోరింది. మనీ లాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించేందుకు, గుర్తు తెలియని లేదా బినామీ పేర్లతో ఎటువంటి అకౌంట్లను ఓపెన్ చేయొద్దని రెగ్యులేటెడ్ సంస్థలకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.