స్టేట్‌ బ్యాంకుకు రికార్డు లాభం

స్టేట్‌ బ్యాంకుకు రికార్డు లాభం
  • రూ.7,626 కోట్లుగా రికార్డు తగ్గిన మొండిబాకీలు
  • 2020 క్యూ2తో పోలిస్తే 67%  అప్‌‌‌‌

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్​కు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో ఎన్నడూ లేనంత లాభం వచ్చింది.  ఏకంగా రూ.7,626 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. ఇప్పటి వరకు బ్యాంకు చరిత్రలో ఇదే ఎక్కువ క్వార్టర్లీ లాభం. గత సంవత్సరం క్యూ2తో పోలిస్తే ఈసారి లాభం 67శాతం పెరిగింది. అప్పుడు రూ.4,574 కోట్లు వచ్చాయి. దీంతో బుధవారం స్టేట్ బ్యాంక్ షేర్లు  రూ.9.20 లాభపడి రూ.530.90లకు చేరుకున్నాయి.  ఎస్‌‌‌‌బీఐ స్క్రిప్ 2021లో ఇప్పటి వరకు 86.83శాతం పెరిగింది.  బ్యాంక్ నిఫ్టీ 27.90 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌‌‌‌గా చూస్తే క్యూ2 లాభం 17 శాతం పెరిగింది. జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో రూ.6,504 కోట్ల లాభం వచ్చింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10.6 శాతం పెరిగి రూ.31,184 కోట్లకు చేరుకుంది. ఫ్యామిలీ పెన్షన్ రూల్స్‌‌‌‌లో మార్పు కారణంగా స్టేట్ బ్యాంక్ రూ.7,418 కోట్లను ప్రొవిజన్‌‌‌‌ చేసింది. తాజా క్వార్టర్లో బ్యాంకు  నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 16 బేసిస్ పాయింట్లు పెరిగి 3.50 శాతానికి చేరుకుంది. నిర్వహణ లాభం గత క్యూ2లో రూ.16,460 కోట్లు కాగా, తాజా క్వార్టర్లో  9.84 శాతం పెరిగి రూ.18,079 కోట్లకు చేరుకుంది.
పెరిగిన అసెట్‌‌‌‌ క్వాలిటీ 
అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. తాజా క్వార్టర్లో స్థూల మొండిబాకీలు 4.90 శాతం ఉండగా, జూన్ క్వార్టర్లో ఇవి 5.32 శాతంగా రికార్డయ్యాయి. గత సంవత్సరం క్యూ2లో 5.28 శాతం ఉన్నాయి.  వడ్డీయేతర ఆదాయం రెండవ క్వార్టర్లో 3.7శాతం తగ్గి రూ.8,207 కోట్లకు పడిపోయింది. కిందటి సంవత్సరం ఇదే కాలంలో రూ.8,527 కోట్లుగా ఉంది. నికర ఎన్‌‌‌‌పీఏ నిష్పత్తి 1.52శాతంగా ఉంది. లోన్‌‌‌‌ లాసుల ప్రొవిజన్లు గత క్యూ2లో రూ.5,619 కోట్లతో పోలిస్తే 55శాతానికిపైగా తగ్గి రూ.2,699 కోట్లకు పడిపోయాయి. అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 6.17శాతం పెరిగాయి. ఇండి విడ్యువల్‌‌‌‌ రిటైల్ అడ్వాన్స్‌‌‌‌లు 15.17శాతం,  ఫారిన్ ఆఫీస్ అడ్వాన్స్‌‌‌‌లు 16.18 శాతం పెరిగాయి. డొమెస్టిక్ అడ్వాన్సులు 4.61శాతం ఎగిశాయి. అడ్వాన్సులలో 24   హోం లోన్ల వాటా 24 శాతం వరకు ఉంది. ఏడాది ప్రాతిపదికన వీటి విలువ 10.74శాతం పెరిగింది.  ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పీసీఆర్) రెండో క్వార్టర్లో 87.68 శాతం ఉంది. స్లిపేజ్ రేషియో 0.66 శాతం మాత్రమే ఉంది. ఇది జూన్ క్వార్టర్లో 2.47శాతం ఉంది.  గత సంవత్సరం క్యూ2తో పోలిస్తే బ్యాంక్ మొత్తం డిపాజిట్లు దాదాపు 10 శాతం పెరిగాయి.  కరెంట్ ఖాతా డిపాజిట్లు 19.2శాతం,  సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు 10.55 శాతం పెరిగాయి. బ్యాంక్  క్యాపిటల్‌‌‌‌ అడెక్వసీ రేషియో (సీఏఆర్) 13.35 శాతానికి చేరుకుంది. గత ఏడాది క్యూ2తో పోలిస్తే ఈసారి రెండో క్వార్టర్లో క్రెడిట్ ఖర్చు 51 బేసిస్ పాయింట్లు తగ్గి 0.43 శాతానికి పడిపోయింది. ‘కాస్ట్‌‌‌‌ టు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ రేషియో’ 54.10 శాతం ఉంది. గత క్యూ2తో పోలిస్తే ఇది 106 బేసిస్ పాయింట్లు పెరిగింది.