
టెక్ కంపెనీ షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ కింద రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇందులో రెడ్‌మి K90, రెడ్‌మి K90ప్రో మాక్స్ ఉన్నాయి. రెడ్‌మి K90ప్రో మాక్స్‌లో బోస్ స్పీకర్లతో పాటు స్పెషల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. అలాగే ఈ రెండు ఫోన్‌లు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తున్నాయి.
వివరాల ప్రకారం, K90 Pro Maxలో కంపెనీ ఇప్పటివరకు ఇవ్వని అతిపెద్ద 7500mAh బ్యాటరీ అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది, దినితో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందించింది. అదేవిధంగా Redmi K90 5G 7000mAh బ్యాటరీతో వస్తుంది.
డిస్ ప్లే: Redmi K90 1440x 3200 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ తో వస్తుంది. Redmi K90 Pro 1440 x 3200 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ తో వస్తుంది.
కెమెరా: ఫొటోస్, వీడియోస్ కోసం Redmi K90 Pro Max 50-మెగాపిక్సెల్ LYT950 OIS కెమెరా, దీనితో పాటు ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50-మెగాపిక్సెల్ Samsung JN5 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కెమెరా కూడా ఉంది.
పర్ఫార్మెన్స్: Redmi K90 Pro Max 5G ఫోన్ Qualcomm మొబైల్ ప్రాసెసర్, Snapdragon 8 Elite Gen 5 ద్వారా శక్తిని పొందుతుంది. 3Nm టెక్నాలజీతో నిర్మించిన 8-కోర్ Oryon CPU దీనిలో ఉంది, ఇది 3.63GHz నుండి 4.6GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగలదు. ఇంకా Snapdragon X85 5G మోడెమ్ కూడా ఉంది, ఇది ఫాస్ట్ ఇంటర్నెట్, బెస్ట్ 5G కనెక్టివిటీని అందిస్తుంది.
RAM అండ్ స్టోరేజ్: ఈ ఫోన్స్ 16GB వరకు RAMతో హై వేరియంట్ గా రానున్నాయి. బేస్ మోడల్ 12GB RAM ఉంటుంది. స్టోరేజ్ విషయానికొస్తే బేస్ వేరియంట్ 256GB, టాప్ వేరియంట్ 1TB వరకు స్టోరేజ్ అందిస్తాయి. Redmi K90లో కూడా ఇదే స్టోరేజ్ అప్షన్స్ ఇచ్చారు.