కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ ల ఫైనల్ లిస్ట్ విడుదల..

కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ ల ఫైనల్ లిస్ట్ విడుదల..

కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టుల ఫైనల్‌ లిస్టును నిమ్స్ ఆసుపత్రి విడుదల చేసింది. మొత్తం 300 మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు మార్చి 4లోపు నిమ్స్‌లోని పాత ఓపీ బ్లాక్‌లోని తొలి అంతస్తులో హెచ్‌ఆర్‌ 1 సెక్షన్‌లో రిపోర్టు చేయాలని ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ తెలిపారు. 

ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిమ్స్‌ వెబ్‌సైట్‌ లో https://www.nims.edu.in/ చెక్ చేసుకోవచ్చని రిజిస్ట్రార్‌ చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఫైనల్ లిస్టును ప్రకటించింది నిమ్స్.