అలర్ట్.. ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి

అలర్ట్.. ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి

స్మార్ట్‌ఫోన్లలో మాల్‌వేర్ మరోసారి కలకలం రేపుతోంది. గూగుల్, యాపిల్ సంస్థలు ఎన్ని సార్లు గుర్తించి వాటిని తొలిగించినప్పటికీ, మాల్‌వేర్ యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో 203 ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరమైనవని సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ యాప్‌లను థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ , నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ  గుర్తించాయి. వీటిని వెంటనే తొలగించాలని గూగుల్, యాపిల్‌ను కోరాయి. ఈ యాప్స్‌ని ఇప్పటికే లక్షలాది మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించిన యాప్స్‌లో కొన్ని పాపులర్ యాప్స్ ఉన్నాయి. 

Beauty filter,Blood pressure  checker,Caller theme, Creative emoji keyboard, Poco launcher,4K Pro Camera, Beat Maker Pro, Art Filters, Blue Scanner, Chat SMS, Cool Messages, Easy PDF Scanner, Frames, Funny Caller, Hi Text SMS, Midget Pro, Menu Maker, Paper Doc Scanner లాంటి యాప్స్ ఉన్నాయి.

మీరు ఈ యాప్స్ ఉపయోగిస్తున్నట్లైతే మీ మొబైల్ నుంచి వెంటే డిలిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ మొబైల్‌లో ఈ మాల్వేర్ ఉంటే ఫోన్ స్లో అవడం, బ్యాటరీ త్వరగా డ్రెయిన్ కావడం వంటి మార్పులు కనిపిస్తాయి. వీటిలో కొన్ని యాప్స్ స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేసి, మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బుల్ని కాజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.