ఇంట్లో నుంచే  డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్

ఇంట్లో నుంచే  డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ముందుగా.. RTO ఆఫీసుకు వెళ్లి.. లర్నర్ లైసెన్స్‌కు అప్లయి చేయాలి.. దాని కోసం RTO ఆఫీసులో ఓ పరీక్ష రాయాలి. అందులో పాస్ మార్కులు వస్తేనే లర్నర్ లైసెన్స్ లభిస్తుంది. లర్నర్ లైసెన్స్ ఇచ్చాక.. ఆరు నెలల లోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ఆరు నెలల్లో పర్మినెంట్ తీసుకోక పోతే.. మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఏ వెహికిల్ కైనా ఇదే ప్రొసీజర్.

లైసెన్స్ కాలపరిమితి 20 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. మరోవైపు.. వన్ ఇయర్ లోపు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే.. కొత్త లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.ఆఫీసుకు వెల్లాల్సిన అవసరం లేకుండా..ఆన్ లైన్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్‌ ను అప్లయి చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్రం ప్రభుత్వం. లర్నర్ లైసెన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ చేంజ్, రెన్యువల్ లాంటి సర్వీసులకు ఒకే ఒక ఆన్‌లైన్ పోర్టల్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.


అప్లైయ్ చేయాల్సిన పద్ధతి..


..ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (పరివాహన్ సేవ) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
..హోం పేజీ నుండి ఆన్‌లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేసి, ఆపై డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను ఎంచుకోవాలి.
.. రాష్ట్రం పేరుని ఎంచుకోవలసిన కొత్త పేజీకి తీసుకెళుతుంది.
.. మీ రాష్ట్రం ఎంపిక ఆధారంగా కొత్త పేజీకి మీరు వెళ్తారు. పేజీలో అనేక ఎంపికలు ఉంటాయి. DL రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోండి’ అని ఎంపికను సెలెక్ట్ చేసుకోండి.
..ఆ తర్వాత అప్లికేషన్ సమర్పించడానికి సూచనలను చూపించే పేజీని చూస్తారు. దరఖాస్తుదారుని పూరించాలి.. లేదా తదుపరి వివరాలను అభ్యర్థించాల్సి ఉంటుంది.
.. మీరు అవసరమైన డాక్యుమెంట్‌లను కూడా అప్‌లోడ్ చేయాలి 
... ఫోటో , సంతకాన్ని అప్‌లోడ్ చేయమని కూడా కోరుతుంది. ఈ దశ మాత్రం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని దయచేసి గమనించండి.
.. ఆ తర్వాత ఫీజు చెల్లించాలి. చెల్లింపును కన్ఫాం చేయాలి.
.. తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు