నెల రోజుల్లో అప్లికేషన్లు పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ కిరణ్మయి

నెల రోజుల్లో అప్లికేషన్లు పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ కిరణ్మయి
  • సబ్​ కలెక్టర్​ కిరణ్మయి ఆదేశం

పిట్లం, వెలుగు : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను నెల రోజుల్లో పరిష్కరించాలని బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దకొడప్​గల్ తహసీల్దార్​ఆఫీస్​ను తనిఖీ చేసి మాట్లాడారు. పెద్దకొడప్ గల్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 499 దరఖాస్తులు వచ్చాయన్నారు. 

ఇందులో 152 మందికి నోటీసులు ఇచ్చామని, మిగతావి అటవీ భూములకు సంబంధించినవని పేర్కొన్నారు. అనంతరం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష రుణం అందజేస్తామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో తహసీల్దార్​ దశరథ్​, నాయబ్ తహసీల్దార్ రవికాంత్, ఆర్​ఐ అంజన్న తదితరులు పాల్గొన్నారు.