ఉచిత విద్యుత్ ముసుగులో..కేసీఆర్ రూ.8 వేల కోట్ల దోపిడీ : రేవంత్ రెడ్డి

ఉచిత విద్యుత్ ముసుగులో..కేసీఆర్ రూ.8 వేల కోట్ల దోపిడీ : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్.. రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఉచిత విద్యుత్ వ్యతిరేకంగా మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. అమెరికా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి.. జులై 13వ తేదీ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

 రైతులకు ఉచిత విద్యుత్ కోసం16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నదని.. వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫాంహౌస్ లు, భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు.. 16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
 సీఎం కేసీఆర్.. ఉచిత విద్యుత్ పేరుతో.. ఆ బడ్జెట్ కింది కేటాయించిన నిధుల్లో సగం డబ్బు.. అంటే ఏడాదికి 8 వేల కోట్లు రూపాయలు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి.