అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్గా రోహిత్ శర్మ రికార్డు

 అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్గా రోహిత్ శర్మ రికార్డు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ మొట్టమొదటి వరల్డ్ కప్ 2007 నుంచి ఇప్పటి వరకు  అన్ని టోర్నీల్లో పాల్గొన్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 36 మ్యాచులు ఆడాడు. 36 మ్యాచుల్లో 36.76 సగటుతో 130.73 స్ట్రైక్ రేట్తో 919 పరుగులు సాధించాడు. ఇందులో 9 అర్థసెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 79 నాటౌట్

రోహిత్ తర్వాత దిల్షాన్
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన జాబితాలో రోహిత్ శర్మ తర్వాత శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ ఉన్నాడు. అతను 35 మ్యాచులు ఆడాడు. తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రేవో, పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉన్నారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది.