దేశంలో రూ. 10వేల నోట్...ఎప్పుడంటే

దేశంలో రూ. 10వేల నోట్...ఎప్పుడంటే

భారతదేశంలో ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోట్ అంటే మనకు గుర్తుకు వచ్చేది రూ. 2వేల నోట్. 2016 వరకు రూ. 1000 నోట్ ఉండేది. ఆ తర్వాత వీటిని రద్దు చేసిన ఆర్బీఐ రూ. 2వేల నోట్ ను అందబాటులోకి తెచ్చింది. తాజాగా రూ. 2వేల నోట్ ను కూడా ఆర్బీఐ ఉపసంహరించుకుంది. అయితే స్వాతంత్ర్యానికి పూర్వం భారత్ లో రూ. 10వేల నోట్ చలామణిలో ఉండేదని మీకు తెలుసా. ఆ నోట్ ఎలా ఉండేదంటే..

రూ. 10 వేల నోట్...

ఇప్పటి వరకు భారత కరెన్సీలో  2000 నోటు అతిపెద్ద నోటుగా ఉండేది. కానీ ఇది తప్పు. ఇంతకుముందు  భారతీయ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ. 10000 నోటుతో ఉండేదని మీకు తెలుసా. ఇదే ఆర్బీఐ వెబ్ సైట్ చెబుతోంది.  నిజానికి 1938 సంవత్సరంలో 10 వేల రూపాయల నోటు చెలామణిలో ఉండేది.  అయితే 1946లో బ్రిటీష్ ప్రభుత్వంలో ముద్రించిన  రూ. 10వేల నోటును చెల్లవని ఆర్బీఐ ప్రకటించింది. మళ్లీ  1954లో చలామణిలోకి తెచ్చినా..1978లో మళ్లీ డీమోనిటైజ్ చేయబడింది.

ఆర్బీఐ చట్టం ఏం చెబుతోంది...?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 24 ప్రకారం.. కరెన్సీ  నోట్లు రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 500గా ఉండవచ్చు.  అయితే  కేంద్ర ప్రభుత్వం లేదా సెంట్రల్ బోర్డ్  కోరుకుంటే రూ. ఆర్బీఐ 1000 , రూ. 5 వేలు, రూ. 10వేల విలువలగల  నోట్లను  జారీ చేయవచ్చు. అయితే ఈ చట్టం ప్రకారం రూ. 10 వేల  కంటే ఎక్కువ నోట్లు ఉండకూడదు.

ప్రస్తుత చలామణిలో ఉన్న నోట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500,  రూ.2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే తాజాగా రూ. 2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. గతంలో ఆర్బీఐ రూ. 2, రూ. 5 నోట్లను కూడా ఆర్బీఐ ముద్రించింది. 

దేశంలో నోట్ల రద్దు ఎన్నిసార్లు జరిగింది

దేశంలో  స్వాతంత్య్రానికి ముందు ఒకసారి నోట్ల రద్దు జరిగింది. జనవరి 12, 1946న భారతదేశంలో మొదటిసారిగా నోట్ల రద్దు జరిగింది.  బ్రిటిష్ హయాంలో విడుదలైన 500, రూ. 1000, రూ. 10 వేల రూపాయల నోట్లు చెల్లవని ఆర్బీఐ  ప్రకటించింది. ఆ తర్వాత 1978 జనవరి 16, 1978న మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రూ. 1000, రూ. 5 వేలు, రూ. 10 వేల  నోట్లను బ్యాన్ చేశారు. మరోసారి నవంబర్ 8, 2016న మోడీ ప్రభుత్వం పాత  రూ. 1000, రూ. 500  నోట్ల రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా రూ. 500 నోట్ , రూ. 2 వేల నోట్ ను ఆర్బీఐ చలామణిలోకి తెచ్చింది. తాజాగా రూ. 2 వేల నోట్ ను ఉపసంహరించుకుంది.