వడ్డీలేని రుణాలు రూ.23 కోట్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

 వడ్డీలేని రుణాలు రూ.23 కోట్లు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని 21,996 స్వయం సహాయ సంఘాలకు రూ.23.26 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి సీతక్క, సీఎస్​ రామకృష్ణారావు, సెర్ప్​ సీఈవో దివ్యరాజన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొని తరువాత జిల్లాలోని ఐకేపీ ఏపీఎంలతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించి మాట్లాడారు. 

 అసెంబ్లీ సెగ్మెంట్​ కేంద్రంగా రుణాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.  ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ మంగళవారం మధ్యాహ్ననానికి ముగించాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికి చీర అందేలా చూడాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్ తదితరులు ఉన్నారు. 

కామారెడ్డి జిల్లాకు రూ. 10 కోట్ల 92 లక్షలు 

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని 14వేల మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ. 10 కోట్ల 92 లక్షలు విడుదలయ్యాయి.  మంగళవారం  అన్ని నియోజకవర్గాల్లో రుణాలను అందజేయనున్నారు.  సోమవారం  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సీఎస్​ రామకృష్ణారావు,, సెర్ప్​ సీఈవో దివ్య దేవరాజన్​లు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  

అనంతరం ​ కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​  సంబంధిత అధికారులతో మీటింగ్ నిర్వహించారు. వడ్డి లోని లోన్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్లు విక్టర్​, మదన్​మోహన్​, డీఆర్డీవో సురేందర్​ తదితరులు పాల్గొన్నారు.