వంట గ్యాస్ ధర రూ.100 పెంపు?

వంట గ్యాస్ ధర  రూ.100 పెంపు?

వంట గ్యాస్ ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన ధరల కారణంగా సిలిండర్ పై వంద రూపాయల నష్టం వస్తోందని...దాన్ని భర్తీ చేసుకునేందుకు ధరలు పెంచక తప్పదని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఐతే ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ధర ఏ మేరకు పెంచాలన్న దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల ఆరో తేదిన సిలిండర్ పై 16 రూపాయలు పెరిగింది. జులై నుంచి లెక్కిస్తే సిలిండర్ పై 90 రూపాయలు పెరిగింది.  ప్రస్తుతం సౌదిలో గ్యాస్ ధరలు 60 శాతం పెరిగాయి. టన్ను గ్యాస్ ధర 60 వేల రూపాయలు పలుకుతోంది.

దీంతో ఆయిల్ కంపెనీలపై సిలిండర్ కు వంద రూపాయల భారం పడనుంది. ఇందులో సబ్సిడీ భారాన్ని కేంద్రం ఎంతవరకు భరిస్తుందో తెలియకపోవడంతో...పెంపు ధరను ఇంకా నిర్ణయించ లేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఐతే సబ్సిడీపై కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సబ్సిడీ భరించడానికి కేంద్రం సిద్ధంగా లేకపోతే పెంపు తప్పదని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో 14.2 కిలోల సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర 899 రూపాయల 50 పైసలుగా ఉండగా....కోల్ కతాలో 926 రూపాయలుగా ఉంది. సంవత్సరానికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరపై అందిస్తున్నారు.