మాచారం వద్ద రోడ్డు ప్రమాదం.. మినీ వ్యాన్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

మాచారం వద్ద రోడ్డు ప్రమాదం.. మినీ వ్యాన్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 
  • మినీ వ్యాన్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 
  • ప్రయాణికులకు స్వల్ప గాయాలు

జడ్చర్ల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవేపై బుధ వారం మినీ వ్యాన్ ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 16 మంది ప్రయాణికులు స్వల్పగాయలతో బయట పడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్  డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నాటకలోని రాయచూర్​కు 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్  నుంచి బయలుదేరింది.

మాచారం వద్ద ముందు వెళ్తున్న మినీ వ్యాన్​ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్​ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న కారును, డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అవతల పల్టీ కొట్టింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108లో బాధితులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్  సీఐ కమలాకర్  తెలిపారు.