బీఆర్ఎస్ హయాంలో తగ్గిన బీసీ రిజర్వేషన్ : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బీఆర్ఎస్ హయాంలో తగ్గిన బీసీ రిజర్వేషన్ : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
  • రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్​ హయాంలో 30 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్​ను 27 శాతానికి తగ్గించి దొర పాలన సాగించారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి విమర్శించారు. శుక్రవారం డిచ్​పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్​లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి గవర్నమెంట్  బీసీ రిజర్వేషన్​ను 42 శాతానికి పెంచి సామాజిక న్యాయం చేయాలని నిర్ణయించిందన్నారు.  జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 63,500​ మంజూరు కాగా, రూరల్ సెగ్మెంట్ లో 16,116 ఉన్నాయన్నారు. 

మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, సెకండ్ విడతలో 75 గజాల స్థలంతో పాటు ఇండ్లు మంజూరు చేసి పేదలకు శాశ్వత నీడ కల్పిస్తామన్నారు.  అవినీతి పాలన సాగించిన బీఆర్ఎస్​కు పుట్టగతులు లేవన్నారు. కేసీఆర్​ పామ్​ హౌస్​కు పరిమితం కాగా, కేటీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మిట్టపల్లి విలేజ్​లో రాంపూర్ సింగిల్ విండో సొసైటీ నిర్మించిన గోదామ్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్, డీసీసీబీ చైర్మన్​ కుంట రమేశ్​రెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్ సతీశ్, ​డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్​రెడ్డి, తారాచంద్ నాయక్​ తదితరులు పాల్గొన్నారు.