
సాచెట్ యాప్.. దీన్ని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ఎమ్డిఎ) డెవలప్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. రియల్ టైం ముందస్తు హెచ్చరికలు అందిస్తుంది. ఇది కామన్ అలర్ట్ ప్రొటోకాల్ (cap)ను కలిగి ఉంది. తుఫాన్, వరదలు, వైల్డ్ ఫైర్, హిమపాతాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వెంటనే అలర్ట్ చేస్తుంది. దాంతోపాటు భద్రతా సూచనలు, జాగ్రత్తలు కూడా చెప్తుంది. ఈ యాప్ పంపే అలర్ట్స్ ద్వారా ఆ క్లిష్ట సమయంలో మనం చిక్కుకోకుండా కావాల్సిన సాయం పొందొచ్చు.
అంటే ఆపదలో ఉన్నవాళ్లకు ఆపద్బాంధవుడిలా వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఈ అప్డేట్స్ కోసం రాష్ట్రం, జిల్లా ఏదైనా ఎంపిక చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఈ సాచెట్ యాప్ తెలుగు, ఇంగ్లీష్ సహా 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. రోజూవారీ వాతావరణ అప్డేట్స్ అందించడం కోసం భారత వాతావరణ శాఖ (IMDB) నుంచి వెదర్ రిపోర్ట్స్, సజెషన్స్ తీసుకుంటుంది. అంతేకాదు.. ఆ టైంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి. ప్రభావిత ప్రాంతాన్ని హెచ్చరించడం, శాటిలైట్ రిసీవర్ కనెక్టివిటీ ఫీచర్, రీడ్ అవుట్ ఫీచర్ వంటి ఇతర వాల్యుబుల్ రిసోర్స్ను కూడా అందిస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.