సెమీస్లో ఒక్క వికెట్ కూడా తీయలేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న:సచిన్

సెమీస్లో ఒక్క వికెట్ కూడా తీయలేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న:సచిన్

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్లో టీమిండియా ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 వరల్డ్ కప్లో అడుగుపెట్టిన భారత జట్టు టైటిల్తో తిరిగి వస్తుందని దేశ ప్రజలతో పాటు..తాను ఆశించినట్లు చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోవడం బాధించిందన్నాడు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి మొదటి కారణం..మెరుగైన టార్గెట్ను నిర్దేశించకపోవడమే అన్నాడు.  అడిలైడ్లో 168 పరుగుల టార్గెట్ అనేది పెద్ద స్కోరు కాదన్నాడు. 190 పైగా పరుగులు చేసి ఉంటే బాగుండేదన్నాడు. 

ఓటమిని అంగీకరించక తప్పదు..
టీమిండియా ఓడిపోవడానికి బౌలింగ్ కూడా ప్రధాన కారణమని సచిన్ తెలిపాడు. ఇంగ్లాండ్ను ఒక్క బౌలర్ కూడా ఇబ్బంది పెట్టలేకపోయాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ 170 పరుగులు చేసినా ఏ బౌలర్ ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదన్న నిజాన్ని జీర్ణించుకోలేపోతున్నానన్నాడు. వరల్డ్ టీ20 క్రికెట్లో టీమిండియా నెంబర్ వన్ టీమ్గా ఉందని..అయితే నెంబర్ టీమ్గా ఉంటే సరిపోదని సచిన్ అన్నాడు. దానికి తగ్గట్లు ఆడాలన్నాడు. అయితే ఆటగాళ్లు కూడా కావాలనే ఓడిపోలేదన్నాడు. ప్రతీ ఆటగాడు దేశం కోసం గెలవాలనే అనుకుంటాడని చెప్పాడు. కానీ ఆ రోజు మనది కానప్పుడు ఎవరు ఏమీ చేయలేరన్నాడు. అన్నిసార్లు విజయాలు దక్కవని..కొన్ని సార్లు ఓటములు కూడా ఎదురవుతాయన్నాడు. ఏది ఏమైనా భారత్ ఓటమిని అంగీకరించకతప్పదన్నాడు.