సాయి ధరమ్ తేజకు వెంటిలేటర్ అవసరం తగ్గుతోంది

సాయి ధరమ్ తేజకు వెంటిలేటర్ అవసరం తగ్గుతోంది
  • అయినప్పటికీ ఐసీయూలోనే అబ్జర్వేషన్లో ఉంచాం
  • కాలర్ బోన్ కు నిన్ననే శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
  • ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల తాజా బులెటిన్

హైదరాబాద్: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. మెల్లగా కోలుకుంటున్నందున వెంటిలేటర్ అవసరం తగ్గుతోందని వైద్యులు వెల్లడించారు. చికిత్సకు స్పందిస్తున్నారంటూ హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాదు అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఐసీయూలోనే అబ్జర్వేషన్ లోఉంచామని వైద్యులు పేర్కొన్నారు. 
గత శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైకు పై ప్రయాణిస్తూ కేబుల్ బ్రిడ్జి  నుంచి ఐకియా కు వెళ్లే రోడ్డులో బండి స్కిడ్ అయి జారిపడి గాయపడిన విషయం తెలిసిందే. ఆయన బైకు పై నుంచి పడిపోయిన విషయం గమనించిన వెంటనే స్థానిక ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సహకారంతో ఓ యువకుడు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి మెడికోవర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వెంటనే షాక్ కు గురై స్పృహ కోల్పోయిన సాయితేజ్ ఆస్పత్రిలో చికిత్సకు స్పందిస్తూ.. కోలుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నొప్పిగా ఉందని మాటలు కట్ చేశారు. ఆయనకు కాలర్ బోన్ స్వల్పంగా విరిగినట్టు గుర్తించిన వైద్యులు నిన్ననే శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సాయి తేజ్ కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వైద్యులు వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన తాజా బులెటిన్.