జూ. ఎన్టీఆర్ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో

జూ. ఎన్టీఆర్ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో

RRRతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరో క్రేజీ మూవీతో రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీతో బ్లాక్ బస్టర్ కొట్టిన తారక్..అతని డైరెక్షన్ లో మరో మూవీ చేయబోతున్నాడు.  NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ చిత్ర బృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

విలన్గా హీరో..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ధృవీకరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 సెట్లో అడుగు పెట్టాడంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. 
 

శ్రీదేవి కూతురు..

జూ. ఎన్టీఆర్, కొరటాల మూవీలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు చేరుకుంది.  ఇప్పటికే ఎన్టీఆర్‌ మాస్‌లుక్‌ పోస్టర్‌, జాన్వీ కపూర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించబోతున్నాడు.