మెహదీపట్నంలో వృద్ధురాలి గోల్డ్చైన్, డబ్బులతో పరార్

మెహదీపట్నంలో వృద్ధురాలి గోల్డ్చైన్, డబ్బులతో పరార్
  • నిందితులు అరెస్ట్​

బషీర్​బాగ్, వెలుగు: ఓ వృద్ధురాలిని నమ్మించి, ఆమె గోల్డ్​చైన్, డబ్బులతో పరారైన నిందితులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్​స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెహదీపట్నంకు చెందిన జి.విజయలక్ష్మి ఈ నెల 4న అమీర్ పేట్ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఇద్దరు వ్యక్తులు అదే ఆటో ఎక్కారు. లక్డీకాపూల్ వద్దకు రాగానే.. డ్రైవర్ ఆటోను ఆపేసి, సమస్య వచ్చిందన్నాడు. ఆటోను తోయాలనడంతో విజయలక్ష్మి నిజమని నమ్మి, తన బ్యాగ్ ను లోపలే ఉంచి దిగింది. 

తర్వాత వారు ఆటో స్టార్ట్ చేసి పరారయ్యారు. బాధితురాలు తన బ్యాగ్ లో 24 గ్రాముల గోల్డ్​చైన్, రూ.12 వేలు, దుస్తులు, ఫోన్​ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా గుడిమల్కాపూర్ కు చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ ఒమెర్, అతనికి సహకరించిన మహమ్మద్ సమీర్, సయ్యద్ జాహూర్ ను మంగళవారం అరెస్ట్​చేశారు.