సామాన్యుడి కోసం AI స్మార్ట్ ఫీచర్లతో శామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. 4 వేల డిస్కౌంట్ ధరకే లాంచ్..

సామాన్యుడి కోసం AI స్మార్ట్ ఫీచర్లతో శామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. 4 వేల డిస్కౌంట్ ధరకే లాంచ్..

కొరియన్ టెక్ కంపెనీ శామ్సంగ్ భారత మార్కెట్లో M-సిరీస్ కింద కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Galaxy M17ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ Galaxy M16కి అప్‌గ్రేడ్ మోడల్. దీనిలో 5nm-ఆధారిత Exynos 1330 చిప్‌సెట్, 4GB ర్యామ్,128GB స్టోరేజ్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ  ఉంది.

ఈ ఫోన్లో కొత్త AI ఫీచర్లతో కంపెనీ లేటెస్ట్ సర్కిల్ టు సెర్చ్ టూల్‌ ఇచ్చింది. దీని ద్వారా స్క్రీన్‌పై కనిపించే ఏదైనా దాని కోసం వెంటనే సెర్చ్ చేయవచ్చు. ఈ ఫీచర్ గతంలో గెలాక్సీ S-సిరీస్‌లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మిడ్-రేంజ్ మొబైల్‌లలో కూడా వస్తుంది. 

శామ్సంగ్ Galaxy M17ని 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసారు, దీని ధర  రూ.16,499. బ్యాంక్ ఆఫర్‌లతో దీనిని కేవలం రూ.12,499కే కొనొచ్చు. ఈ ఫోన్ సేల్స్ అక్టోబర్ 13 నుండి స్టార్ట్ అవుతాయి. Galaxy M17 భారతదేశంలో Redmi Note 14 5G, iQOO Z10x, Realme Narzo 70 Turbo వంటి ఫోన్‌లకు పోటీగా వస్తుంది. 

స్పెసిఫికేషన్లు చూస్తే :
డిస్ ప్లే:
ఈ ఫోన్ 1080 x 2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ కి గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో ప్రొటెక్షన్ అందించారు. 

కెమెరా: ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ప్రాసెసర్ & OS: పర్ఫార్మెన్స్ కోసం దీనిలో 5nm Exynos 1330 చిప్‌సెట్‌ ఉంది. స్టోరేజ్  కోసం 4GB RAMతో 128GB మెమరీకి సపోర్ట్ ఇస్తుంది. Android 15 One UI ఆపరేటింగ్ సిస్టమ్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ, OS అప్ డేట్స్ ఉంటాయి. 

బ్యాటరీ: ఛార్జింగ్ కోసం 5000mAh బ్యాటరీ ఫోన్లో ఇచ్చారు. ఇది 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ ఫోన్ బాక్స్‌లో రాదు. Galaxy M17 5G అద్భుతమైన డిస్‌ప్లే, కెమెరా, పెద్ద బ్యాటరీ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించవచ్చు. అయితే, మీరు ఈ ఫోన్లో మల్టి ట్యాస్కింగ్ పనులు, హై ఎండ్ గేమ్స్  ఆడలేరు.