
కాళేశ్వర పరిసరాలు జనసంద్రంగా మారాయి. సరస్వతి పుష్కరాల 8వ రోజైన గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజే సుమారు 70 వేల మంది కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారని దేవాదాయ శాఖ ఆఫీసర్లు తెలిపారు. స్థానికంగా వర్షం పడుతుండడంతో పార్కింగ్ స్థలాలు మార్చారు. మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే వెహికల్స్ అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం పంపించారు. పూసుకుపల్లి వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
గాలి వాన వల్ల కూలిన టెంట్లను పునరుద్ధరించారు. ప్రతిరోజు 300 బస్సుల్లో 40 వేల మంది భక్తులను కాళేశ్వరం తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ ఆఫీసర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన 15 మందికి ట్రీట్మెంట్ అందించారు. ఎంపీ ఈటల రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, సత్యనారాయణ, సినీహీరో అల్లు అర్జున్ తల్లి పుష్కరస్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్, వెలుగు