సంక్రాంతి వేళ మాంజా (సింథటిక్ దారం) వాడొద్దని ‘రెస్పాన్సిబుల్ కైట్ ఫ్లయింగ్’ పేరుతో పక్షి ప్రేమికులు సంజీవయ్య పార్క్ పరిసరాల్లో శనివారం 2కె రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అటవీ సంరక్షణాధికారిణి సువర్ణ మాట్లాడుతూ.. మంజా వాడకం వల్ల ఏటా అనేక పక్షులు గాయాలపాలవుతున్నాయని, కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ దారాలతోనే పతంగులు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. - వెలుగు, హైదరాబాద్
