ఎస్​బీఐ లాభం అదుర్స్

ఎస్​బీఐ లాభం అదుర్స్

న్యూఢిల్లీ:స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) మొదటి క్వార్టర్​కు మంచి రిజల్ట్స్​ ప్రకటించింది. ఈ క్వార్టర్లో స్టేట్​ బ్యాంక్​ నికర లాభం 55.3 శాతం పెరిగి రూ. 6,504 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో బ్యాంకుకు రూ. 4,189 కోట్ల లాభం వచ్చింది. జూన్​ 2021తో ముగిసిన ఫస్ట్​ క్వార్టర్లో స్టేట్​ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (నెట్​ ఇంటరెస్ట్​ ఇన్​కం) కూడా 3.15 శాతం పెరిగి రూ. 27,638 కోట్లకు చేరింది. మొదటి క్వార్టర్లో ఇతర ఆదాయం రూ. 11,803 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 7,958 కోట్లు మాత్రమే. జూన్​ 2021 నాటికి బ్యాంకు గ్రాస్​ ఎన్​పీఏలు కొద్దిగా పెరిగి 5.32 శాతమయ్యాయి. నెట్​ ఎన్​పీఏలూ 1.77 శాతానికి పెరిగాయి. స్లిప్పేజెస్​ లేదా కొత్త బ్యాడ్​ లోన్లు ఏకంగా నాలుగు రెట్లు పెరిగి రూ. 15,666 కోట్లకు చేరాయి. ప్రొవిజన్లు కొంత తగ్గి రూ. 10,052 కోట్లకు పరిమితమయ్యాయి. కొవిడ్​ 19 ఎఫెక్ట్​ వల్ల ఎకనమిక్​ యాక్టివిటీస్​ తగ్గాయని రిజల్ట్స్​ ప్రకటన సందర్భంగా ఎస్​బీఐ పేర్కొంది. ఈ సవాళ్లను తట్టుకోవడానికి అన్ని విధాల ప్రిపేర్​ అవుతున్నట్లు వెల్లడించింది. అప్పులు తీసుకున్న వాళ్లు టైములో తిరిగి చెల్లించలేకపోవచ్చని, అదే విధంగా వర్కింగ్​ క్యాపిటల్​ సైకిల్స్​ కూడా ఎక్స్​టెండ్​ కావొచ్చని బ్యాంకు తెలిపింది. ఈ ప్రోబ్లమ్స్​ను బ్యాంకు ఎదుర్కోవల్సి ఉంటుందని పేర్కొంది. రిజల్ట్స్​ ప్రకటన నేపథ్యంలో ఎస్​బీఐ షేర్లు 2 శాతం పెరిగి రూ. 456 కి చేరాయి.