స్కూల్ హెడ్మాస్టర్ ఇంట్లో తుపాకీ, చైనీస్ గ్రెనేడ్స్ స్వాధీనం

స్కూల్ హెడ్మాస్టర్ ఇంట్లో తుపాకీ, చైనీస్ గ్రెనేడ్స్ స్వాధీనం

పాకిస్థాన్ నుంచి అక్రమంగా ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం జమ్మూకాశ్మీర్, పూంచ్‌ జిల్లాలోని హరి బుద్ధ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి 6 సెక్టార్‌కి చెందిన 39 RR, రోమియో ఫోర్స్, ఎస్ఓజీ భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. 

ఈ క్రమంలో ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా పనిచేస్తున్న కమరుద్దీన్ అనే స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ విదేశీ తయారీ పిస్టల్‌తో పట్టుబడ్డాడు. దీంతో అదుపులోకి తీసుకుని అతని ఇంట్లో తనిఖీ చేయగా.. రెండు చైనీస్ గ్రెనేడ్లు, ఒక పాకిస్తాన్ తయారీ పిస్టల్.. బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. పూంచ్ ప్రాంతంలో జరగబోయే ఎన్నికలకు భంగం కలిగించడానికి వీటిని ఉపయోగించేందుకు ప్లాన్ చేసినట్లు భదత్ర బలగాలు అనుమానిస్తున్నాయి.  నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు