Vijay-Rashmika : విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ.. అసలు నిజం ఇదే!

Vijay-Rashmika : విజయ్ దేవరకొండతో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ.. అసలు నిజం ఇదే!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందానపై నిత్యం సోషల్ మీడియాలో ఏదోఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల న్యూయార్క్‌లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి .  క్షణాల్లోనే వైరల్ అయ్యాయి . అంతే కాదు వీరి నిశ్చితార్థం కూడా సిక్రెట్ గా అయిపోయిందంటూ వార్తలు వచ్చాయి.  దుబాయ్‌లో జరిగిన SIIMA 2025 అవార్డ్స్ వేడుకలో రష్మిక ఎడమచేతి ఉంగరం వేలికి ఒక ఉంగరం ధరించడం ఈ పుకార్లకు మరింత బలాన్ని ఇచ్చాయి.

ఎంగేజ్మెంట్ పై క్లారిటీ..

ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో, అభిమానులు వెంటనే విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగిందని ఊహించడం మొదలుపెట్టారు.  సోషల్ మీడియాలో నిశ్చితార్థంపై చర్చ పతాక స్థాయికి చేరింది. అయితే, ఈ పుకార్లపై రష్మిక మందాన స్వయంగా స్పందించారు. తన ఎంగేజ్మెంట్ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. ఆ ఉంగరం తన వ్యక్తిగతమైనదని, దానికి ఒక సెంటిమెంటల్ విలువ ఉందని, కానీ అది నిశ్చితార్థానికి చిహ్నం కాదని ఆమె వివరించారు. ఈ ప్రకటనతో ఆమె తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చకు ముగింపు పలకారు.

ALSO READ : తేజ సజ్జా 'మిరాయ్'.. 'నెక్స్ట్ బాహుబలి' ..

విజయ్ ఏమన్నారంటే?

గతంలో కూడా ఇదే తరహా పుకార్లపై విజయ్ దేవరకొండ  స్పందించారు. తమ మధ్య ఎటువంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని ఆయన తేల్చి చెప్పారు. తామిద్దరం తమ వ్యక్తిగత జీవితానికి గోప్యతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.  ఒత్తిడి లేకుండా తమ బంధాన్ని సహజంగా కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. తామిద్దరం తమ వృత్తిపరమైన ఎదుగుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అభిమానుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత విషయాలు గ్యోపంగా ఉంచాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.