RGV on Mirai : తేజ సజ్జా 'మిరాయ్'.. 'నెక్స్ట్ బాహుబలి' .. ఆర్జీవీ రివ్యూ ఏమని ఇచ్చాడంటే?

RGV on Mirai : తేజ సజ్జా 'మిరాయ్'.. 'నెక్స్ట్ బాహుబలి' ..  ఆర్జీవీ రివ్యూ ఏమని ఇచ్చాడంటే?

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన చిత్రం ' మిరాయ్'  ఈరోజు ( సెప్టెంబర్ 12న ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీలో తేజ సజ్జా, మంచు మనోజ్ పాత్రలపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  'హనుమాన్' సినిమా తర్వాత తేజ సజ్జా మరోసారి రికార్డు సృష్టించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు అభినందిస్తున్నారు. 

'నెక్స్ట్ బాహుబలి' ..  'మిరాయ్'

లేటెస్ట్ గా మిరాయ్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రివ్యూ చేస్తూ..  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ రావడంతో 'మిరాయ్' చిత్ర బృందాన్ని ప్రశంసించారు. "ఇండస్ట్రీ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, విశ్వప్రసాద్‌లకు నా బిగ్ షౌటౌట్. 'బాహుబలి' తర్వాత ఏ సినిమాకు కూడా ఇంత ఏకగ్రీవమైన ప్రశంసలు వినలేదు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, కథనం హాలీవుడ్ స్థాయికి సమానంగా ఉన్నాయి" అని రామ్ గోపాల్ వర్మ తన X అకౌంట్‌లో పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రానికి 'నెక్స్ట్ బాహుబలి' అనే బిరుదు ఇస్తూ ప్రశంసించడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

శ్రీరాముడిగా ప్రభాస్.. 

ఈ సినిమా విడుదలకు ముందు .. తేజ సజ్జ ' మిరాయ్ ' ఒక 'రెబెల్యస్ సర్పైజ్' ఉందని పరోక్షంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తున్నారనే ఊహగానాలు ఇంటర్ నెట్ లో చక్కర్లు కొట్టాయి.  ఆ అంచనాలను నిజం చేస్తూ ఆయన పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ ఫాంటసీ యాక్షన్ ఎడ్వెంచర్ సినిమా ప్రారంభంలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతే కాకుండా .. ఆయన శ్రీరాముడి పాత్రలో కూడా తెరపై కనిపించారు. అయితే పూర్తిగా ముఖం కనిపించేలా కాకుండా ఒక ప్రత్యేకమైన షాట్ లో  మాత్రమే దర్శనమిచ్చారు.

ALSO READ: వరకట్న వేధింపుల కేసులో ప్రముఖ నిర్మాత..

కథాంశం.. 

పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ 'మిరాయ్' సినిమా  క్రీ.పూ 250లో చక్రవర్తి అశోకుని కాలంలో సృష్టించబడిన తొమ్మిది పురాతన గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రంథాలకు సామాన్య మానవులను శక్తివంతమైన దేవతలుగా మార్చే అద్భుతమైన సామర్థ్యం ఉంది.  ఈ గ్రంథాలను సొంతం చేసుకుని దుష్టశక్తిని ప్రపంచంపై రుద్దాలని మంచు మనోజ్ నాయకత్వంలోని 'బ్లాక్ స్వార్డ్' తెగ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో, ఆ పవిత్ర గ్రంథాలను కాపాడటానికి 'సూపర్ యోధగా తేజ సజ్జా రంగంలోకి దిగుతాడు. తన దివ్యదండం 'మిరాయ్' సహాయంతో విలన్లను ఎదుర్కొంటాడు.  ఈ సినిమాలో రితిక నాయక్, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.  హరి గౌర సంగీతం అందించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో చూడాలి.