
కొమురంభీం జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కాపాడటానికి వెల్లి ముగ్గురు పిల్లలతో పాటు నీటి మడుగులో పడిపోయింది తల్లి. ఈ ఘటనలో తల్లితో పాటు ముగ్గురు చిన్నారు మృతి చెందారు.
సెప్టెంబర్ 13న వాగులో మందు బస్తాలు శుబ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముడుగులో మునిగిన పిల్లలను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించిన తల్లి నీలబాయి ఆ మడుగులోనే మునిగి ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనతో దాబా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ముడుగులో మునిగి చనిపోయిన నలుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.