మంచిర్యాల జిల్లాలో యువతను ప్రోత్సహించేందుకే క్రికెట్ టోర్నమెంట్ : రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్

 మంచిర్యాల జిల్లాలో  యువతను ప్రోత్సహించేందుకే క్రికెట్ టోర్నమెంట్ : రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్

మంచిర్యాల, వెలుగు: యువతను క్రీడల్లో ప్రోత్సహిండానికే ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. 

యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా లక్ష్యం పెట్టుకొని, దాన్ని సాధించేవరకు శ్రమించాలని సూచించారు. ​ప్రతినిధులు ముఖేశ్​గౌడ్, వెంకటేశ్వర్ రావు, సతీశ్​రావు, మురళి, శ్రీనివాస్,  రాజమౌళి,  దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.