కడెం, వెలుగు: యూరియా కోసం కడెం మండల రైతులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తాము 3 రోజులుగా గ్రోమోర్, పీఏసీఎస్చుటూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని, సిబ్బంది వారికి కావాల్సిన జగిత్యాల జిల్లా రాయికల్ మండల రైతులకు ఇస్తున్నారని ఆరోపించారు.
ఒక్కో బస్తాకు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని, ఒక జింక్ బస్తాను రైతులకు అంటగడుతున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఏడీఏ సుజాత, ఎస్సై సాయికిరణ్ అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రోమోర్ కేంద్రానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
