ఖానాపూర్ / పెంబి, వెలుగు: నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్స్పెషల్ ఆఫీసర్శిల్పారావు మంగళవారం పెంబి బ్లాక్‌లోని పెంబి మండల కేంద్రంతోపాటు, నాగపూర్, మందపల్లి, కోసగుట్ట, శెట్పల్లి, జంగుగూడ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన, భోజనం, మౌలిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. చక్కగా చదువుకొని జీవితంలో మంచి స్థానంలో నిలవాలని సూచించారు.
పెంబి బ్లాక్అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. అనంతరం అధికారులు ఆమెను సత్కరించారు. అడిషనల్కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎస్టీ సంక్షేమ అధికారి అంబాజీ, పెంబి సర్పంచ్ సత్యనారాయణస్వామి, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, సీడీపీవో శ్రీలత తదితరులున్నారు.
