సబ్బుల నుంచి హార్లిక్స్ వరకు రేట్లు తగ్గించిన హిందుస్థాన్ యూనీలివర్.. కొత్త రేట్లివే.

సబ్బుల నుంచి హార్లిక్స్ వరకు రేట్లు తగ్గించిన హిందుస్థాన్ యూనీలివర్.. కొత్త రేట్లివే.

మోడీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్ రేట్లతో మార్పులు సామాన్యుల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని తీసుకురాబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లకు అనుగుణంగా కంపెనీలు కూడా తగ్గించిన రేట్లను ఆఫర్ చేయాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పటంతో ఈసారి డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు రేట్లు తగ్గుతాయని, నెలాఖరులో షాపింగ్ చేయటం బెటర్ అని చాలా మంది గృహిణులు ప్రస్తుతం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనీలివర్ అనేక వస్తువులపై రేట్ల తగ్గింపుతో కూడాని ప్రకటనలను విడుదల చేస్తోంది. 

ALSO READ : సెబీ కీలక నిర్ణయం..

కంపెనీ ఇచ్చిన యాడ్స్ ప్రకారం తగ్గించబడిన కొన్ని ఉత్పత్తుల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిస్తే.. 

  • 340 ఎంఎల్ డౌ షాంపూ రేటు రూ.490 నుంచి రూ.435కి తగ్గించబడింది.
  • 200 గ్రాముల హార్లిక్స్ పౌడర్ డబ్బా రేటు రూ.130 నుంచి రూ.110కి తగ్గించబడింది
  • 200 గ్రాముల కిసాన్ జామ్ డబ్బా రిటైల్ ధర రూ.90 నుంచి రూ.80కి తగ్గించిన హిందుస్థాన్ యూనీలివర్. 
  • ప్రజలు ఎక్కువగా వినియోగించే లైబాయ్ 75 గ్రాముల ప్యాక్ రేటు రూ.68 నుంచి రూ.60 తగ్గనుంది. 
  • 200 గ్రాముల బూస్ట్ రేటు రూ.124 నుంచి రూ.110కి తగ్గించబడింది
  • 75 గ్రాముల బ్రూ కాఫీ రేటు రూ.300 నుంచి రూ.270కి తగ్గింది.
  • క్లోజ్ అప్ 150 గ్రాముల పేస్ట్ రేటు రూ.145 నుంచి రూ.129 తగ్గించింది కంపెనీ